What Is Digital Marketing- About Digital Marketing In Telugu |bolgamraj

మన అనుకునేవారికి షేర్ చేయండి

What is Digital  Marketing ? (డిజిటల్ మార్కెటింగ్అంటేఏంటి)What is Digital Marketing About Digital Marketing In Telugu bolgamraj

 

డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు Marketing  అంటే ఏంటో తెలుసుకోవాలి.

Marketing  :  

ఏదేని ఒక వస్తువు గురుంచి కానీ వ్వవస్థ గురుంచి కానీ, సంస్థ గురుంచి Service గురుంచి కానీ, మరియు ఏదేని ఒక అంశం గురుంచి కానీ ప్రజలకు తెలిసేలా చేయడాన్నే Marketing  అంటారు. Marketing  ని ప్రస్తుతం  2 Types  గా పరిగణించ వచ్చు. అవి 1. Traditional మార్కెటింగ్  2. Digital Marketing

Traditional Marketing :

గతంలో ఇంటర్నెట్ ఎక్కువగా అందుబాటులో లేని సమయంలో ఉపయోగించిన పాత Marketing  పద్దతిని ప్రస్తుతం Traditional  Marketing  అంటున్నారు.For Example : 1. News Paper Ads   2. Tv Ads 3. pamphlets. 4.  Hoardings వీటినే Billboards  అని కూడా అంటారు. 5. Mouth Publicity and 6. Man  to  Man  Publicity అంటే తమ Product ని తీసుకునే స్థోమత ఉన్న వాళ్ళకి, తమ Product ని తీసుకునే అవసరం ఉన్న వాళ్ళకి  ఒక్కరికి లేదా ప్రజలు  సమూహంగా ఉన్న సమయంలో Publicity చేసేవారు ఇప్ప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం

About Digital Marketing : 

Digital Marketing అంటే ఇంటర్నెట్ ని ఉపయోగించుకొని Online  లో  ఏదేని ఒక వస్తువు గురుంచి కానీ వ్వవస్థ గురుంచి కానీ , సంస్థ గురుంచి Service గురుంచి కానీ , మరియు ఏదేని ఒక అంశం గురుంచి  కానీ  ప్రజలకు తెలిసేలా చేయడాన్నే  Digital Marketing  అంటారు. Traditional Marketing వలె  Digital Marketing  కి కూడా చాలా  Ways  ఉన్నాయి.For Example : 1. Blogging ద్వారా Marketing  చెయ్యవచు. 2. Website ద్వారా Marketing  చేయవచ్చు. Social  Media ద్వారా Marketing  చెయ్యవోచు. ఇలా చాలా  Ways  ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ముందు ముందు  క్షుణ్ణంగా తెలుసుకుంటాం.

How it is  Useful  Digital Marketing? ( డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉపయోగపడుతుంది.)

ఈ డిజిటల్ మార్కెటింగ్ వల్ల  Digital Marketing చేసేవారికి లాభాలున్నాయి. చేయించుకునేవారికి లాభాలున్నాయి ఆ Digital మార్కెటింగ్ ని Use  చేసుకునే వారికీ కూడా లాభాలున్నాయి . అది ఎలాగో చూద్దాం !  ఒక్కప్పుడు ప్రజలు ఏదేని ఒక వస్తువు ని కానీ ఇంకేదైనా కొనాలి అనుకున్నపుడు దాని గురుంచి తెలుసుకోవాలంటే ఇంట్లో పెద్ద వాళ్ళనో , పొరుగువాళ్ళనో , స్నేహితులనో , ఇలా వారికీ తెలిసిన వాళ్ళని అడిగేవారు ఇదంతా జరగడానికి చాలా  సమయం పట్టేది కానీ !  ఇప్పుడు   మీరు ఉన్నచోటి నుండే పక్కవారిని అడగకుండా  క్షణాల్లో  మీ చేతిలో Mobile  నో Computer నో  use  చేసి మీకు కావలసిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. అంటే  కారణం Digital Marketing  ఎందుకంటే ఈ రోజులో ప్రతి ఒక్క చిన్న Business  అయినా Service  అయినా వాటి గురుంచి Online  లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. That  is  Digital  Marketing .

Digital Marketing  వల్ల  మీ సమయం ఆదా అవుతుంది. శ్రమ మరియు  Money  ఆదా అవుతుంది. ఎలాగంటే ఫర్ Example  మీరు ఒక product ని కొనాలి అనుకున్నపుడు ఆ Product మీకు అందుబాటులో ఉండకపోవొచ్చు అందుకు మీరు ఉన్న చోటి నుండి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుంది  అదే Online  (Digital  Marketing ) ని Use  చేసుకుంటే మీరు ఉన్న చోటికే Product వస్తుంది.

Defference of Traditional Marketing Vs Digital Marketing

 

Tradotional vs digital In Telugu by bolgamraj

Why Learn Digital Marketing?or Why do Digital Marketing  ( Digital  Marketing ఎందుకు నేర్చుకోవాలి)

         ఎందుకు నేర్చుకోవాలి అంటే  మీ Business  (వ్యాపారాన్ని) , కాని Service  ని కాని మీ Talent ని ఇంకేదయినా కావచ్చు Publicity  చేసుకొని డబ్బులు, పేరు ప్రఖ్యాతలు  సంపాదించాలంటే   Digital  Marketing  ఖచ్చితంగా  నేర్చుకోవాలి. ప్రస్తుత సమాజం  దినదినాన  అభివృద్ధి చెందుతుంది ఎంతగా అభివృద్ధి చెందుతుంది అంటే  ఒక్కపుడు వీదీకి  ఒక  ఫోన్  ఉండేది , వీదీకి  ఒక  Tv  ఉండేది. ఎక్కడో government  ఆఫీస్ ల లోనో లేదా బాగా డబ్బున్న వారితోనే  Computers  ఉండేవి.  కానీ ….. ప్రస్తుతం , ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్  తప్పనిసరి అయిపొయింది. ఒక్కప్పుడు  వీధీలో  ఒక్క Tv  ఉంటె ఆ వాడ  మొత్తం వారి ఇంటిముందే ఉండేది. కాని ప్రస్తుతం ఇంట్లో ఉన్న ప్రతి రూమ్ కి కూడా ఒక Tv అయిపొయింది.  ఇక Computers  అయితే  పట్టణాల్లో  ప్రతి ఇంట్లో ఒక కంప్యూటర్ ఉంటుంది.  గ్రామాలో అయితే ఇప్పుడిపుడే computers  వాడే వారి సంఖ్య   ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. 

      ప్రస్తుతం ప్రజలు  మెల్లి మెల్లి గా Digital , ( internet, Online ) వైపు అడుగులేస్తున్నారు,  ప్రస్తుతం  Internet  ని వాడే వారి సంఖ్య  75 %  గా ఉంది, ఇక రాబోయే 2 Years  లో 100 % కి చేరబోతోంది , అంటే ఇక మీరే గమనించవొచ్చు Digital  ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, కాలంతో మారినవాడే మనిషి మార్పు లేనివాడు మరుగున పడక తప్పదు అన్నది ఎంత నిజమంటే , మనం కాలంతో  పాటు మారకుంటే కాలానికి అనుగుణంగా మారిన ఈ ప్రపంచం మనల్ని  కాళ్ళకింద తొక్కేసి ముందుకెళుతోంది.

         ఈ  Internet  ప్రభావం  జనాల్లో ఎంత ఉందంటే నిక్కర్లు యేసుకోలేని బుడ్డ పోరగాండ్ల నుంచి పండు ముసలి వరకు ఫోన్ లోనే గడుపుతున్నారు. దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలంటే Digital  ప్రపంచం దినదినాన అభివృద్ధి చెందుతుంది. ఎప్పటికైనా Digital Marketing  విలువ (Strategy ) పెరుగుతుందే కానీ తగ్గదు ……..  మనం ఈ Digital  మార్కెటింగ్ రంగాన్ని ఎంచుకుంట్లయితే  ఎప్పటికి Growth  ఉంటూనే ఉంటుంది.  ఈ  Digital  ప్రపంచంలో  మన బ్రతుకు బండి సవ్యంగా నడవాలంటే Digital  Marketing  పై కనీస అవగాహన అయినా తప్పని సరిగా ఉండాల్సిందే.

Who Can  Learn  Digital  Marketing ? (Digital  Marketing  ని ఎవరెవరు నేర్చుకోగలరు)

Who Learn Digital Marketing In Telugu by bolgamraj

         బాగా చదువుకున్న వారు నేర్చుకోవచ్చు చదువుకుంటున్న వారు నేర్చుకోవొచ్చు, చదువు ఆపేసిన వారు కూడా నేర్చుకోవొచ్చు, House Wives  నేర్చుకోవచ్చు, Students  నేర్చుకోవొచ్చు, Business  చేసేవారు నేర్చుకోవొచ్చు, Part  Time  గా money సంపాదించాలి  అనుకునేవారు నేర్చుకోవొచ్చు.  ఇలా  ఎవరైనా నేర్చుకోవొచ్చు. పెద్దగా  చదువులు చదవకున్న  కాస్తంత English తెలిసి ఉండాలి. Basic  Computer  గురుంచి తెలిసి ఉండాలి,  Internet గురుంచి కూడా తెలిసి ఉండాలి .  కానీ చదువు రానివారు Digital  Marketing  ని కొంత వరకె ఉపయోగించగలరు, వారి సొంత Business ని కొంత   వరకు మాత్రమే Marketing  చేసుకోగలుగుతారు.  Job చెయ్యాలన్న, Consultant   గా రాణించాలన్న , Digital  Marketing  Agency ని  స్థాపించాలన్న, మొత్తని కి  ఈ Digital  Marketing  లో తార స్థాయిలో రాణించాలన్న, కనీసం 10+ పైన విద్య అర్హత  ఉండాలి. ఎంత విద్య అర్హత, ఎంత English skills , ఎంత Computer   Skills  ఉంటె   అంత తొందరగా Digital  Marketing  లో పేరు ప్రఖ్యాతలతో రాణించగలరు. కానీ Digital  Marketing  లో దాగి ఉన్న  రహస్యం ఏమిటంటే Digital  Marketing  అంటే Passion ఉన్న వారికి నేర్చుకునే కొద్దీ  ఈ Digital  Marketing  రెట్టింపు ఉత్సహాన్నిస్తుంది.

Digital  Marketing Basic  Equipment ? ( Digital  Marketing  కి కావలసిన పరికరాలు)

Digital Marketing Basic Equipment In Telugu bolgamraj

       computer ఉండాలి, Mobile ద్వారా కూడా చెయ్యవోచు. కానీ mobile  అన్నింటికీ అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి computer  ఉంటేనే   Digital Marketing ని Better  గా  నేర్చుకోవొచ్చు , Better  గా చెయ్యవొచ్చు, Computer కి Internet ఉండాలి లేదా మీకు ఒక smart  phone  ఉండి  అందులో Internet  Connection ఉండాలి, Mobile  నుంచి  Hotspot   ON  చేసి మన Computer  కి Net  ని Connect చెయ్యవొచ్చు. Basic English వచ్చి ఉండాలి. Basic Computer వచ్చి ఉండాలి, కనీసం కొంతైనా Internet ని ఉపయోగించడం తెలిసిఉండాలి.ముఖ్యంగా మీకు నేర్చుకోవాలన్న ఆసిక్తి ఎక్కువగా ఉండాలి. ఓపికి కూడా చాల ఉండాలి.

 

 

 

 

 

 


మన అనుకునేవారికి షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *